- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో తోపులాట కారణంగా 2 నెలల చిన్నారి మృతిచెందిన ఘటనపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, నేతలు డీజీపీ శివధర్‌రెడ్డికి వినతిపత్రం అందజేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజాలు వెలికితీయాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



