- Advertisement -
నవతెలంగాణ-అచ్చంపేట
పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో గురువారం నాలుగో విడత మెగా సర్జికల్ క్యాంపు విజయవంతంగా ప్రారంభమైంది. క్యాంపులో భాగంగా తొలి ఉదయం 20 మంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ మెగా సర్జికల్ క్యాంపులో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ గా వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించారు. శస్త్రచికిత్సల ప్రక్రియను పర్యవేక్షిస్తూ రోగులకు ధైర్యం చెప్పారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మెగా సర్జికల్ క్యాంపు ద్వారా అనేక మంది పేద, నిరుపేద రోగులు ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. క్యాంపు ఏర్పాట్లు, వైద్య సేవల నిర్వహణపై డాక్టర్లను, వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.
- Advertisement -



