నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ బస్టాండ్ లో గురువారం ఓ బాలుడు తప్పిపోయాడు. రోడ్డుపై ఏడుస్తూ తిరుగుతున్న బాలుడిని చూసిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది బాలుడిని స్టేషన్ కు తీసుకెళ్ళి వారి ఆధీనంలో భద్రంగా ఉంచారు. అంతకుముందు బాలుడి తలిదండ్రులు కూడా తీవ్రంగా గాలిస్తున్నారు. అనంతరం బాలుడి కుటంబసభ్యులు కానీ, బంధవులు, ఎవరైనా గుర్తు పడితే సంబంధిత ఆధారాలు చూపిస్తే వారికి అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. దాదాపుగా రెండు మూడు గంటల తర్వాత పోలీస్ స్టేషన్ కు తలిదండ్రులు వచ్చి బాలుడిని చూసి ఆనందంతో పొంగిపోయారు. ఒక్కసారిగా భయపడ్డామని, ఇక దొరుకుతాడో లేదో అని ఆందోళన చెందామని పోలీసులకు వివరించారు. బాలుడిని తలిదండ్రులకు అప్పగించడంతో వారు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తప్పిపోయిన బాలుడిని తలిదండ్రులకు అప్పగించిన ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



