బన్నీ వాస్, డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా ‘ఇడుపు కాయితం. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛ నంగా ప్రారంభమైంది. కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ వంశీకృష్ణ దొండపాటి మాట్లాడుతూ,'ఈ కథ చెప్పగానే నమ్మి సినిమా చేస్తున్నామని గట్టిగా చెప్పిన మా తబితకి థ్యాంక్స్ అని అన్నారు. ‘డైరెక్టర్ వంశీ ఈ కథ చెబుతున్నప్పుడు మేము చిన్న ప్పుడు విన్న విషయాలు, పెద్ద వాళ్లు ఎలా హ్యాండిల్ చేసేవాళ్లు.. అవన్నీ గుర్తొచ్చాయి. నేను ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిపోయాను. వంశీ ఈ క్యారెక్టర్స్, ఎమోషన్స్ చాలా బాగా రాసుకున్నారు. అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారుఅని ప్రొడ్యూసర్ తబిత సుకుమార్ తెలిపారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ,'మన అందరి ఇళ్లలో ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అది పెళ్లయిన వారికి తెలుసు అని అన్నారు.
భిన్న కథతో ‘ఇడుపు కాయితం`
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



