Friday, June 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలురెస్పాన్స్ అదుర్స్

రెస్పాన్స్ అదుర్స్

- Advertisement -

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 19న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌మంత‌, రాజ్ నిడిమోరు, హిమాంక్‌, నందినీ రెడ్డి, శ్రీముఖి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా..స‌మంత మాట్లాడుతూ ‘‘‘మా ఇంటి బంగారం’ సినిమాకు వ‌స్తోన్న రెస్పాన్స్ చూసిన త‌ర్వాత చాలా సంతోషంగా అనిపించింది. థియేట‌ర్స్‌లో సినిమాను చూస్తుంటే స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంది. రాజ్ ఈ రోల్ రాస్తున్నప్పుడు కమ‌ర్షియ‌ల్ ఇంపాక్ట్ ఉండేలా రాశారు. కెరీర్‌లో చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. కొంద‌రైతే స‌మంత అయిపోయింద‌ని కూడా రాశారు. హీరోయిన్‌గా ఇక క‌ష్ట‌మ‌ని కూడా అన్నారు. దాన్ని నేను ఛాలెంజ్‌గా తీసుకుని వ‌చ్చాను. సినిమా చూసిన త‌ర్వాత చిరంజీవి అప్రిషియేష‌న్స్ మాకు పెద్ద బూస్ట్ ఇచ్చింది. సినిమాను ఇంత భారీ స‌క్సెస్ చేసిన ఆడియెన్స్‌కు మ‌నస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను’ అని అన్నారు. ‘రాజ్ కథను డిజైన్ చేసినప్పుడే అన్నీ వర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా ఎలిమెంట్స్ ఉండాల‌నే ఆలోచ‌న‌తో చేశారు. స‌మంత‌ని సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా పెట్టుకుని డిజైన్ చేశారు. ఇంత‌కు ముందు మీర‌నుకుంటున్న సామ్ కంటే ప‌ది రెట్లు ఎక్కువ‌గా చూస్తార‌ని ముందుగానే చెప్పాను. అదే నిజమైందిఅని డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి చెప్పారు. నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ,'ఈ సినిమా ప్ర‌తి ఇంటి వ‌ర‌కు వెళుతుంది. సమంత ఈ క‌థ‌ను చెప్ప‌గానే ఓకే చెప్పింది. నందినీ బాగా స‌పోర్ట్ చేసింది అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -