Friday, June 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపుల్లో అక్రమాలు

ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపుల్లో అక్రమాలు

- Advertisement -

కల్వకుర్తిలో దళిత నిరుద్యోగుల రిలే నిరాహార దీక్ష
నవతెలంగాణ -కల్వకుర్తి టౌన్

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపులు వివాదాస్పదంగా మారాయి. నిరుపేద దళిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నిర్మించిన షాపులను నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు కేటాయించారని ఆరోపిస్తూ అర్హులైన దళిత నిరుద్యోగులు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది బంధువులకు దుకాణాలు కేటాయించగా, ఏండ్లుగా ఎదురుచూస్తున్న అర్హులైన దళిత అభ్యర్థులను పక్కన పెట్టారని తెలిపారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చి కేటాయింపులు జరిపారని ఆరోపించారు. అక్రమ కేటాయింపులను వెంటనే రద్దు చేసి పారదర్శకంగా అర్హులైన లబ్దిదారులకు దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. లేనిచో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -