Friday, June 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉపసర్పంచులకు గౌరవ వేతనం ప్రకటించాలి

ఉపసర్పంచులకు గౌరవ వేతనం ప్రకటించాలి

- Advertisement -

సమస్యలు పరిష్కరించకపోతే
‘చలో సచివాలయం’ : ఉపసర్పంచుల
ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ‌వద్ద ధర్నా

నవతెలంగాణ – ముషీరాబాద్
ఉపసర్పంచులకు నెలకు రూ.5,000, వార్డు సభ్యులకు రూ.3,000 గౌరవ వేతనం వెంటనే ప్రకటించా లని ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ కటకం స్వప్న, వైస్ ప్రెసిడెంట్ మామిడి కవిత డిమాండ్ చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉప సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ‌దగ్గర గల ధర్నా చౌక్ వద్ద చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్తీక్‌ ‌మాట్లాడుతూ.. ఉపసర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నారనే ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై సర్పంచ్ పేరుతో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యుల పేర్లను కూడా చేర్చాలని కోరారు. స్టాండింగ్ కమిటీల్లో ఉపసర్పంచులను వైస్ చైర్మెన్లుగా నియమించా లని, పంచాయతీ తీర్మానాలపై సర్పంచ్, కార్యదర్శితో పాటు ఉపసర్పంచులకు కూడా సంతకం చేసే అధికారం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపసర్పంచుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తదుపరి దశలో ‘చలో సచివాలయం’ కార్యక్రమానికి పిలుపునిస్తామని ప్రకటించారు. ఉపసర్పంచుల హక్కులు, గౌరవం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టుకుని సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ధర్నాలో నాయకులు దుశ్శ కుమార్, గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, స్పోక్స్‌ పర్సన్ కమలాకర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి, ఎం. నరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -