Friday, June 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లు

క్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -

28లోగా లొకేషన్ల ఖరారు.. జూలై మొదటి వారంలో బ్రోచర్ విడుదల : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆ కలను నెరవేర్చే క్రమంలో వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే క్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే వారికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ సచివాలయంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆర్‌డీఓ, తహసీల్దార్ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణం, భద్రాచలం దేవస్థానం అభివృద్ధి అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది క్యూర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రయోగాత్మకంగా తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇండ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు 20 వరకు స్థలాలను గుర్తించామని, మిగిలిన ప్రాంతాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి ఈ నెల 28వ తేదీలోగా అన్ని లొకేషన్లను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి స్థలానికి సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లు, నిర్మాణ నమూనాలను కూడా జూన్ 28లోగా సిద్ధం చేయాలని, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలతో కూడిన బ్రోచర్‌ను జూలై మొదటి వారంలో విడుదల చేస్తామని వెల్లడించారు. క్యూర్ పరిధిలో అత్యంత ముఖ్య మైన ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వభూముల్లో ఇండ్ల నిర్మాణాలను చేపడుతు న్నామని, ఈ స్థలాల్లో అన్ డివైడెడ్ షేర్ క్రింద మహిళలకు వాటా కల్పిస్తూ ఆ భాగాన్ని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని మరోమారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వ ర్యంలో ఒకే మోడల్ లో ఆర్.డి.ఓ., తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నా మని మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరితగతిన పనులు ప్రారంభించేలా ప్రణాళిక లను సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. ఆర్.డి.ఓ. తహ శీల్దార్ కార్యాలయాల భవనాల మరమ్మతు లకు సంబంధించి హౌసింగ్ ఏ.ఈ. లు భవనాలను సందర్శించి ప్రతిపాదనలను పంపిం చాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి, డి.ఎస్. లోకేశ్ కుమార్, హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -