Friday, June 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసికింద్రాబాద్‌‌లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌‌లో అగ్నిప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న సూర్యకిరణ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ఉన్న వ్యాక్స్ కన్సల్టింగ్ సొల్యూషన్స్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెద్దఎత్తున పొగలు వ్యాపించడంతో సహాయక చర్యలకు కొంతసేపు అంతరాయం ఏర్పడినా, పొగలు తగ్గిన అనంతరం సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. కార్యాలయంలో దేవుడి చిత్రపటాల వద్ద వెలిగించిన దీపం నుంచి మంటలు వైర్లకు అంటుకుని షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదం సంభవించినట్టు అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనలో కార్యాలయానికి కొంత మేర ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -