Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోన్ గావ్, బస్వాపూర్ జీపీలలో గ్రామసభ

డోన్ గావ్, బస్వాపూర్ జీపీలలో గ్రామసభ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని డోన్ గావ్ , బస్వాపూర్ జీపీ గ్రామంలో సోమవారం గ్రామ సభ సమావేశం డోన్ గావ్ గ్రామ యువ సర్పంచ్  కే.శ్రీనివాస్, బస్వాపూర్ గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిపి పరిధిలోని గ్రామాలలో పలు సమస్యల పైన  పాలకవర్గం సభ్యులు ప్రజలతో చర్చించడం జరిగింది. ప్రజలు చెప్తున్న సమస్యలను, గ్రామములో తిరిగి ఈ  పరిశీలించడం జరుగుతుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పనులను తప్పక చేపడతామని గ్రామ సభలో గురు గ్రామాల సర్పంచ్ లు కే . శ్రీనివాస్, రమణ సురేష్ గొండ హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం సమావేశంలో ప లు విషయాలు అంశాలపై చర్చించడం జరిగింది.

• ఉపాధి హామీ పనులు,
• లేబర్ మొబిలైజేషన్,
• నర్సరీ కార్యక్రమాలు ,
• ఇందిరమ్మ ఇళ్ల పురోగతి ,
• మంచినీటి సరఫరా & నిర్వహణ ,
• పారిశుధ్య నిర్వహణ ,

• గ్రామ అభివృద్ధి సంబంధిత ఇతర అంశాలు ప్రస్తావించి గ్రామస్తులకు వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో   గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్, ఉప సర్పంచ్ హనుము గోండ పంచాయతీ కార్యదర్శి అంజయ్య , వార్డు సభ్యులు,  వివిధ శాఖల సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -