- Advertisement -
• మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి
నవతెలంగాణ -పెద్దవంగర
రైతు భరోసా కోసం అర్హులైన రైతులు జూలై 5లోగా దరఖాస్తులు సంబంధిత ఏఈవో లకు అందజేయాలని మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జూన్ 15, 2026 నాటికి భూ భారతి, ధరణి ఆధారంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అర్హులను తెలిపారు. పట్టాదారు పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో పాటు అవసరమైన దరఖాస్తులను క్లస్టర్ రైతు వేదికలు (పెద్దవంగర, చిట్యాల, అవుతాపురం)లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని సూచించారు. ఇప్పటికే రైతు భరోసా పథకం లబ్ధిదారులు గా ఉన్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
- Advertisement -



