- Advertisement -
-పోలీస్ స్టేషన్ యందు ముస్లీంల విజ్ఞప్తి
-దారిని మూసేసినవారిపై ఫిర్యాదు
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలో నిర్మించుకున్న మసీదులోఎన్నో ఏళ్లుగా నిత్యం ప్రార్థనలు చేసుకుంటున్నామని, నేడు కొందరు వ్యక్తులు మసీదులోకి వెళ్లేందుకు దారి లేకుండా చేశారని, దారి ఇప్పించాలని పోలీసులను పలువురు ముస్లీంలు విజ్ఞప్తి చేశారు. మసీదులోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోకుండా దారి మూసేసిన వారిపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని శుక్రవారం ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Advertisement -



