Tuesday, February 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలునాని 32వ చిత్రం టైటిల్ ఖరారు..

నాని 32వ చిత్రం టైటిల్ ఖరారు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్‌ స్టార్ హీరో నాని తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ సినిమా అప్‌డేట్‌తో ఉత్సాహంలో ఉన్న ఫ్యాన్స్‌కు, తన 32వ చిత్రంతో మరో అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించారు. ‘ఓజీ’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని చేయబోయే ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. గతంలోనే ప్రకటించిన ఈ ప్రాజెక్ట్, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, తాజాగా అధికారికంగా మొదలవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం ‘ఓజీ’ యూనివర్స్‌కు సంబంధం లేదని, సుజీత్ తొలి చిత్రం ‘రన్ రాజా రన్’ తరహాలో స్టైలిష్ యాక్షన్‌తో కూడిన డార్క్ క్రైమ్ కామెడీగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నాని ఒకవైపు చెఫ్‌గా కనిపిస్తూనే, మరోవైపు గ్యాంగ్‌స్ట‌ర్‌గా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -