- Advertisement -
నవతెలంగాణ-జన్నారం
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశానుసారం శుక్రవారం ఇందన్ పెళ్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎన్ఎస్ యుఐ రాష్ట్ర నాయకులు సోషల్ షా తెలిపారు. అధ్యక్షునిగా కంటం సాయి రామ్, ఉపాధ్యక్షునిగా కాండ్రపు వంశీ, సభ్యులు రాగుల వెంకటేష్, అరవింద్, కృష్ణ, మహేష్, రంజిత్, సాధిక్, అశోక్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్లావత్ శంకర్ నాయక్, , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంద రాజేష్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి హేమంత్ చారి,చుంచు నర్సయ్య, సుధాకర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



