నవతెలంగాణ – రాజోలి
రాజోలి మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ సర్కిల్ సెంటర్లో ఇటీవల జరిగిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం జాతరలో దళితులపైన అగ్రకుల పెత్తందారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పసిపాప కన్నుమూసింది. జాతరకు వచ్చిన దళితులు కొబ్బరికాయ కొట్టడానికి గుడి లోపలికి వెళ్తుంటే అగ్రకుల పెత్తందారులు వారిని అడ్డుకొని మీరు తక్కువ జాతి కులస్తులు గుడి లోపలికి రానివ్వము అని అన్నారు. దళితులు కాలవేల పడి మేము కొబ్బరికాయ కొడతాము అని అన్నారు. అయినా పెత్తందారులు వినకుండా వారిపై విత్యక్షణారహితంగా దాడి చేసి కొట్టి గాయపరిచారు.
ఈ దాడిలో ఏ పాపం ఎరుగన పసిపాప ప్రాణాలు వదిలింది. ఇలాంటి కుల దురహంకార హత్యలు జరగడం ఆటవిక చర్య అని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆర్ విజయ్ కుమార్ అన్నారు. దాడి జరిగి వారం రోజులు అవుతున్న పోలీసులు అగ్రంకుల పెత్తందారులపై కేసు నమోదు చేయట్లేదు.. అరెస్టు చేయట్లేదు.. పైగా దళితులపైనే అక్రమ కేసులు పెట్టారు. దళితులను విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. వెంటనే అగ్రకుల పెత్తందారులను అరెస్టు చేసి, జైలుకు పంపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పాప కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ప్రెషన్ ప్రకటించాలని కోరారు. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి విజయకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతర సందర్భంగా దాడి జరిగిన దళితులకు న్యాయం జరిగేంత వరకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆటో యూనియన్ నాయకులు జయన్న పాల్గొన్నారు.



