Saturday, June 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘హైకూ’ చిత్రీకరణ పూర్తి

‘హైకూ’ చిత్రీకరణ పూర్తి

- Advertisement -

‘కోర్ట్ఫేమ్ శ్రీదేవితో పాటు ఏగన్, ‘మిన్నల్ మురళి’ మూవీ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బహుభాషా చిత్రం ‘హైకూ’. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తు న్నారు. యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి మాట్లాడుతూ, 'కథను నమ్మి నాకు పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన మా నిర్మాతలకి ధన్యవాదాలు. ఈ సినిమాను హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగమైన చిత్రంగా, ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఫీల్‌నిచ్చే మూవీలాగా రూపొందిస్తున్నాం అని తెలిపారు. ‘మా సినిమా చిత్రీకరణ పూర్తయ్యేలోపే సినిమా పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. కథపై డైరెక్టర్‌కు ఉన్న స్పష్టత, మేకింగ్‌లో తను చూపిన నిజాయితీ, క్రమశిక్షణతో సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. సినిమాలోని ఎమోషన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి` అని నిర్మాతలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -