- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో బూతు స్థాయి ఓటర్లకు శనివారం సర్ ఓటర్ల పాంలను గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిఎల్ఓ లతో కలిసి పాంలను అందజేశారు. ఫాంల వివరాలు,నమోదు ఏవిధంగా చేయాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మీరాజు,బత్తుల తిరుపతి,బిఎల్ఓ శ్రీకాంత్,ఓటర్లు పాల్గొన్నారు.
- Advertisement -



