Saturday, June 27, 2026
E-PAPER
Homeజిల్లాలుహనుమకొండలో జాన్ వెస్లీ, కూనంనేని అరెస్ట్

హనుమకొండలో జాన్ వెస్లీ, కూనంనేని అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ హనుమకొండ: హనుమకొండ పరిధిలోని గుండ్లసింగారంలో పేదలు వేసుకున్న గుడిసెలను, ఇండ్లను అధికారులు గత శనివారం కూల్చివేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న సీపీఐ కార్యాలయమైన ‘సురవరం భవన్’ను కూడా కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గుడిసెల అక్రమకూల్చివేతలకు నిరసన కార్యక్రమానికి వామపక్షాలు పిలుపునిచ్చాయి. గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లులు నిర్మించి ఇవ్వాలని కోరుతూ వరంగల్, హనుమకొండ జిల్లాల వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీ నిర్వహించారు.

బాధితులకు మద్దతుగా నేడు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ ఇతర నాయకులు హనుమకొండలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. పేదల ఇండ్లను కూల్చివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ప్రభుత్వ తీరుపై వారు తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వామపక్ష కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కార్యక్రమంలో సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు జాన్ వెస్లీ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేసి హనుమకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్ రెడ్డి, సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు సింగారపు బాబు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా నాయకులు కారు ఉపేందర్ తదితరులున్నారు.

ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి, ఉన్న ఇండ్లను కూల్చివేయడం దారుణమని, ఇండ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సమరశీల పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -