నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని వెల్మలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను త్వరలోనే పున:ప్రారంభం చేస్తామని మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు అన్నారు. శనివారం తాడిచెర్ల కాంప్లెక్స్ ప్రాధానోపాధ్యాయుడు తిరుపతితో కలిసి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థుల కృషి, వెల్మలపల్లి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహంతో పాఠశాల పరిశుభ్రం చేయడం అభినందనీయమన్నారు.
వారి అభ్యర్థన మేరకు పాఠశాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల శాతం పెంచేందుకు ఇదే విధంగా కృషి చేస్తే త్వరలోనే జిల్లా విద్యాశాఖ అధికారిచే పాటశాల ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలకు త్వరలోనే ఫర్మిచర్, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.



