రేవంత్ రెడ్డి మిత్రమండలి రాష్ట్ర నాయకులు జంగయ్య
నవతెలంగాణ-మిడ్జిల్
తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో విడుదల చేసినట్లే ఉమ్మడి మిడ్జిల్ మండల్ , ఊరుకొండ మండల అభివృద్ధి కోసం జీవో విడుదల చేయాలని రేవంత్ రెడ్డి మిత్రమండలి రాష్ట్ర నాయకులు పెరుమాళ్ళ జంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూలై 4వ తేదీన ఉమ్మడి మండల అభివృద్ధి కోసం వస్తున్న సందర్భంగా శనివారం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, కోడిగంటి నందంతో కలిసి నవతెలంగాణతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ జీవితం ఇచ్చిన ఉమ్మడి మండల ప్రజలు అభివృద్ధి చేయాలని మండల ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు అని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం జీవ విడుదల చేసి జీవో నెంబర్ 24 విడుదల చేసి నియోజకవర్గాన్ని 20వేల కోట్ల తో ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. జీవో నెంబర్ 14తో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్తో పేరుతో పదివేల కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మిడ్జిల్ మండల ప్రజలు జెడ్పిటిసిగా గెలిపించి ముఖ్యమంత్రి స్థాయికి పంపించిన మండల అభివృద్ధి కోసం పదివేల కోట్లు నిధులు మంజూరు తో పాటు జీవో విడుదల చేయాలని ఉమ్మడి మండల ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
మండల కేంద్రంలో బస్టాండ్ , అగ్రికల్చర్ యూనివర్సిటీ డిగ్రీ కళాశాల, 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ముడి సరుకుల తయారీలో భాగంగా టిసిఎస్ ఆదిభట్ల తరహాలో ఏరో స్పేస్ తయారు సరుకుల అనుబంధ సంస్థలును ఉమ్మడి మండలంలో ఏర్పాటు చేస్తే నిరుద్యోగుల సమస్య తీరుతుందని కోరారు. ప్రతి గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాలు, సోలార్ విద్యుత్ , పశు వైద్యశాలలు, ప్రతి గ్రామంలో అంగన్వాడీ భవనాలు నిర్మాణం, విజయ డైరీ తరహాలో పాలసీతలీకరణ కేంద్రం , వైద్య ఉపకేంద్రాలు, మండల కేంద్రం నుండి అన్ని గ్రామాలకు బీటి రోడ్లను మంజూరు చేయాలని కోరారు. నాగర్కర్నూల్ జిల్లా సిర్సవాడ, మాదారం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి కొరకు 20 కోట్ల 54 లక్షలు నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



