- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ యూట్యూబర్ కోమలి (22) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. HYD మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న కోమలి BSC చదువుతూ పార్ట్ టైమ్లో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. మూడేళ్లుగా మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ప్రేమలో ఉన్న కోమలికి ఏడాది క్రితం బ్రేకప్ అయింది. గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేసిన కోమలి, తాజాగా సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



