ఆస్ర్టేలియాతో భారత్ ఢీ నేడు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్
లార్డ్స్ (ఇంగ్లాండ్) : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ ఆఖరు అంకానికి చేరుకుంది. గ్రూప్-1 నుంచి నాలుగు విజయాలతో ఆస్ర్టేలియా సెమీఫైనల్ బెర్త్ ఖాతాలో వేసుకోగా… రెండో బెర్త్ రేసులో భారత్, దక్షిణాఫ్రికా పోటీపడుతున్నాయి. భారత్ నేడు ఆస్ర్టేలియాతో తలపడనుండగా.. బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా పోటీపడనుంది. భారత్, దక్షిణాఫ్రికా మూడు విజయాలు, ఆరు పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచినా.. నెట్‌రన్‌రేట్ పరంగా టీమ్ ఇండియా మెరుగైన స్థితిలో కొనసాగుతుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సఫారీలు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. భారత్‌ను ఆసీస్ ఓడిస్తేనే దక్షిణాఫ్రికా ముందంజ వేయగలదు. అటు భారత్, అటు దక్షిణాఫ్రికా విజయాలు సాధిస్తే.. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సెమీఫైనల్‌కు చేరుకోనుంది.
ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ర్టేలియాపై అదిరే విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్న అమ్మాయిలు.. నేడు లార్డ్స్‌లో అదే ప్రదర్శన పునరావృతం చేసేందుకు సిద్దమవుతున్నారు. స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ మెరిస్తే భారత్‌కు తిరుగుండదు. రిచా ఘోష్, దీప్తి శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడలు సైతం భారత్‌కు అత్యంత కీలకం కానున్నారు. అగ్రజట్టుపై మేటి ప్రదర్శన చేయగల సత్తా టీమ్ ఇండియా సొంతం. అదే ఉత్సాహంలో నేడు విజయమే లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం.
సెమీస్‌పై కన్నేసి..!
- Advertisement -
- Advertisement -



