Sunday, June 28, 2026
E-PAPER
Homeఆటలుముగిసిన షూటింగ్‌ పోటీలు

ముగిసిన షూటింగ్‌ పోటీలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ :
8 రోజుల పాటు ఉత్కంఠగా సాగిన తెలంగాణ రాష్ట్ర 12వ చాంపియన్‌షప్స్‌ పోటీలు శనివారం ముగిశాయి. 1260 షూటర్లు పలు విభాగాల్లో సత్తా చాటగా, ఉత్తమ షూటర్లు జాతీయ, రీజినల్‌ స్థాయి పోటీల రాష్ట్ర జట్లకు ఎంపికయ్యారు. మాజీ డీజీపీ అంజనీ కుమార్‌ యాదవ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ మెన్స్‌ విభాగంలో రెండు పతకాలు సాధించగా, ఓపెన్‌ మాస్టర్స్‌ మహిళల విభాగంలో మాధవీలత పసిడి పతకం సాధించారు. సూర్య కృష్ణ చిత్తూరు ఓ పసిడి, మూడు రజతాలు సాధించగా, చిత్తూ లీషా కిరణ్‌ నాలుగు పసిడి పతకాలతో సత్తా చాటింది. తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమిత్‌ సంఘీ, భారత జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ అధికారులు విజేతలకు బహుమతులు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -