Wednesday, February 25, 2026
E-PAPER
Homeజాతీయంశరద్‌పవార్ డిశ్చార్జ్‌

శరద్‌పవార్ డిశ్చార్జ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇటీవల అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం ఎన్‌సీపీ నేత శరద్‌పవార్‌ పూనెలోని రూబీ హాల్‌ ఆసుపత్రిలో చేరారు. డీహ్రైడేషన్‌కు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆదివారం ఈ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో బుధవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శరద్‌పవార్‌ బాగానే ఉన్నారు. అందుకే ఆయనను డిశ్చార్జ్‌ చేశాం. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించాం అని రూబీ హాల్‌ ఆసుపత్రి చీఫ్‌ కార్డియాలజిస్ట్‌, ఛైర్మన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ అయిన డాక్టర్‌ పర్వేజ్‌ గ్రాంట్‌ అన్నారు.

కాగా, శరద్‌పవార్‌ ఈ నెల్లోనే ఫిబ్రవరి 9న ఛాతి ఇన్ఫెక్షన్‌ వల్ల ఇదే ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఆరోగ్యం మెరుగుపడగానే ఆయన ఫిబ్రవరి 14న డిశ్చార్జ్‌ అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -