Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంటి నెంబర్‌‌ కేటాయింపునకు లంచం డిమాం

ఇంటి నెంబర్‌‌ కేటాయింపునకు లంచం డిమాం

- Advertisement -

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
రూ.25 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత
కేసు నమోదు.. వరంగల్ సెంట్రల్ జైలుకు తరలింపు


నవతెలంగాణ-ముదిగొండ

ఇంటి నెంబర్‌ ‌మంజూరు కోసం రూ.25వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టబడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్నే వీరబాబు అనే వ్యక్తి తన రేకుల షెడ్డుకు ఇంటి నంబర్ కోసం బాణాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్‌‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు రూ.25 వేలు లంచం ఇవ్వాలని కార్యదర్శి డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని, వీరబాబు నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, నిందితుడిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్టు సమాచారం. గతంలోనూ ఆయన పనితీరు పట్ల ఫిర్యాదులు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -