Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమొదటిసారి అడుగంటిన ఎల్‌ఎండీ

మొదటిసారి అడుగంటిన ఎల్‌ఎండీ

- Advertisement -

ఎల్లంపల్లి మోటార్లను ఆన్‌ ‌చేసి జలాశయాన్ని నింపాలి :
ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌
ఎల్‌ఎండీలో 
ఆటలు ఆడుతూ నిరసన


​నవతెలంగాణ – కరీంనగర్

ఎల్ఎండీ జలాశయం అడుగంటడంతో కరీంనగర్ నగర ప్రజలకు, హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గాల రైతులకు సాగు, తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. శనివారం బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎల్ఎండీలో ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ రెండు దశాబ్దాల చరిత్రలో జులై మాసంలో ఎల్ఎండీ నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి పడిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ​మేడిగడ్డను మరమ్మతు చేయకపోవడం వల్ల ప్రతిరోజూ 10 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోందని, ఆ నీటిని మేడిగడ్డ నుంచి కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లికి తరలించాలని అన్నారు.

ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్ చేసి వరద కాలువ ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎండీలను నింపాలని డిమాండ్ చేశారు. మిడ్ మానేరుపై ఆచంపల్లి దగ్గర ఉన్న తూము ద్వారా నీటిని విడుదల చేసి కొత్తపల్లి మండలంలోని బావుపేట, ఎలగందుల, నాగుల మల్యాల, బద్దిపల్లి, కమాన్పూర్, శ్రీరాములపల్లి, కాజీపూర్ గ్రామ చెరువులను నింపాలన్నారు. ​ప్రస్తుతం ఎల్ఎండీలో ఐదున్నర టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందని, ఇందులో మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్ పోతే మిగిలిన రెండు టీఎంసీలతో తాగునీరు అందించడం సాధ్యం కాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిరోజూ తాగునీరు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మూడు రోజులకు ఒకసారి ఇస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేతకాదని చేతులెత్తేస్తే.. తమ నాయకులతో కలిసి కన్నెపల్లి మోటార్లను ఆన్ చేసి ప్రజలకు నీరందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -