Sunday, June 28, 2026
E-PAPER
Homeజిల్లాలుచిన్నారులకు పోలియో చుక్కలు వేసిన జబర్దస్త్ నటులు

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన జబర్దస్త్ నటులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలం కొండంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమానికి జబర్దస్త్ ఫేమ్ నూకరాజు..ఆసియా జంట హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బంధువుల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన పరిధిలో ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.అనంతరం పోలియోపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైద్య, అంగన్ వాడి సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -