Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్త రైతులకు భరోసా.!

కొత్త రైతులకు భరోసా.!

- Advertisement -

జూలై 5 వరకు దరఖాస్తుకు అవకాశం ఏవో శ్రీజ
నవతెలంగాణ – మల్హర్ రావు

వానాకాలం రైతు భరోసా నిధులను కొత్త పట్టాదారులకు సైతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని,జూన్ 15 వరకు కొత్తగా భూములు కొనుగోలు చేసి,రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు జూలై 5లోగా వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తు చేసుకో వాలని మండల వ్యవసాయాధికారి శ్రీజ సూచించారు.మండలంలో దాదాపు వందమంది కొత్త రైతులు ఉన్నట్లు సమాచారం.ఈనెల 30న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు.కాగా, ఏప్రిల్లో యాసంగికి సంబంధించి రెండు ఏకరాలలోపు రైతులకు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు.

ఐదో విడత నిధులు
రైతు భరోసా ఎకరాకు రూ.6 వేలకు పెంచుతు కాంగ్రెస్ ప్రభుత్వం,ఇప్పటివరకు 4 విడతల నిధులు విడుదల చేసింది. మొదట డిసెంబర్ 2023లో అధికారంలోకి రాగానే 2024 జనవరిలో ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేసింది.అనంతరం రైతు భరోసాపై అధ్యయనం చేస్తున్నామంటూ సాగదీసి జూన్ నెల నిధులు విడుదల చేయలేదు.2025లో జనవరి, జూన్ నెలల రైతు భరోసా నిధులను ఎకరాకు రూ.6 వేలకు పెంచి రెండు విడతలు రైతుల ఖాతాల్లో వేశారు.తిరిగి 2026 జనవరి నెలకు సంబంధించి,ఏప్రిల్లో రూ.6 వేల చొప్పన రెండెకరాల వరకు వేసి నిలిపివేశారు.ఈసారి వానాకాలం పంటకు మాత్రం ఈనెల 30న రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.ఎన్ని ఎకరాల వరకు వేస్తారనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -