వైద్యాధికారిణి డాక్టర్ సౌజన్య
నవతెలంగాణ-నసురుల్లాబాద్
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నసురుల్లాబాద్ పిహెచ్ సి వైద్యులు డాక్టర్ సౌజన్య తెలిపారు. ఆదివారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంను ప్రారంభించారు. అలాగే మండల పరిధిలో అమలు అవుతున్న పల్స్ పోలియో కార్యక్రమంను పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సౌజన్య మాట్లాడుతూ ఈనెల 28 నుంచి జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో అప్పుడే పుట్టిన పిల్లలనుండి 5 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో అనువైన చోట పోలియా బూత్ లను ఏర్పాటు చేయాలని ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదనే లక్ష్యంతో సిబ్బంది పని చేయాలన్నారు. మండల ప్రజలు పల్స్ పోలియో కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలన్నారు . ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్ వాడి, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



