Monday, June 29, 2026
E-PAPER
Homeదర్వాజరాలిపోవడం అంటే కొత్త చిగురు వేయడమే

రాలిపోవడం అంటే కొత్త చిగురు వేయడమే

- Advertisement -


చివరి ఆకైనా
చెట్టును వదిలి వెళ్లాల్సిందే
గూడు విడిచిన పక్షి
ఆకాశాన్ని నమ్మాల్సిందే
ఈ ‘రోజు’ కూడా
రేపటికి జ్ఞాపకంగా మారిపోతుంది
ఋతువులన్నీ
మార్పు అనే అక్షరాల్నే రాస్తాయి
నిలిచి ఉండాలనుకోవడం
చెట్టు వేర్ల కోరిక
ముందుకు సాగిపోవడం
బతుకు ధర్మం
చెట్టు నుండి రాలిన
ఆకు చెప్పే పాఠం ఒక్కటే
విడిచిపెట్టడం కూడా
నూతన వికాసానికి ఆరంభమే
మార్పును ఆలింగనం చేసుకున్న గుండె
మళ్లీ కొత్త చిగురుగా పుడుతుంది
వారాల ఆనంద్, 9440501281

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -