Monday, June 29, 2026
E-PAPER
Homeమానవిసరైన జీవనశైలితో…

సరైన జీవనశైలితో…

- Advertisement -

పెండ్లయిన ప్రతి అమ్మాయి తల్లి కావాలని కోరుకుంటుంది. ఇది సర్వసాధారణం. అయితే నేడు మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, అధిక రేడియేషన్, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వంటి కారణాల చేత చాలా మంది ఈ ఆనందానికి దూరమవుతున్నారు. గర్భధారణ కోసం ఎంత ప్రయత్నిస్తున్నా.. చాలా మందిలో ఫలితం కనిపించడం లేదట. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినా చాలా మందికి నిరాశే మిగులుతుంది. ఇలాంటి సమయంలో జీవనశైలి ఎలా ఉందో చూసుకోవటం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే సంతానం కలగకపోవటం అనేది ఏదో ఒక్క సమస్యతో ముడిపడి ఉండదని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మంచి జీవనశైలితో సంతాన భాగ్యం ఎలా పొందాలో తెలుసుకుందాం…

సంతానలేమి పై తీవ్రమైన మానసిక ఒత్తిడి, దీర్ఘకాలంగా నిద్రలేమి, ఎక్కువగా మొబైల్ ఫోన్లు, ల్యాప్​టాప్​లను చూడటం, వేళకు ఆహారం తినకపోవటం, పొగ తాగటం, మద్యం అలవాటు, భార్యభర్తల మధ్య ఆత్మీయత తగ్గటం వంటి రకరకాల అంశాలు ప్రభావం చూపుతున్నాయి.
సరైన ఆహారం తీసుకోకపోవడం ఆరోగ్యవంతమైన అండం, వీర్య కణాల తయారీలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితాల్లో కాల్స్, మీటింగ్స్ హాజరు కావటం, ప్రయాణాలు చేయటం, లక్ష్యాలను చేరుకోవటం లాంటివి వల్ల చాలామంది సమయానికి భోజనం చేయకుండా కాలం గడుపుతున్నారు. సమోసాలు, బర్గర్లు, పిజ్జాలు వంటివి తిని అప్పటికి ఆకలిని తీర్చుకుంటున్నారు. ఇవన్నీ సంతానాన్ని దూరం చేసే అలవాట్లు. అందుకే గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న మహిళలు తృణధాన్యాలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, చేపలను ఆహారంగా తీసుకోవాలని.. ట్రాన్స్ ఫ్యాట్స్, రెడ్ మీట్ వినియోగాన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆఫీసు ఒత్తిడి
చాలా మంది భార్యాభర్తలు శారీరకంగా దగ్గరగా ఉన్నా ఆలోచనలన్నీ ఉద్యోగ వ్యవహారాల చుట్టే తిరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. మెయిల్స్ చెక్ చేసుకోవటం, లక్ష్యాల గురించి చింతించటం ద్వారా పని ఒత్తిడిని పడక గది వద్దకు తీసుకొస్తుంటారని పేర్కొంటున్నారు. ఒత్తిడి ఒక్కటే వంధ్యత్వానికి కారణం కావడం అసంభవం అయినప్పటికీ, అది గర్భం దాల్చే మహిళ సామర్థ్యానికి
జీవనశైలిలో మార్పు
పైన చెప్పిన సమస్యన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే జీవనశైలిని సరిదిద్దుకోవటం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సరైన పోషకాహారం తినటం, వేళకు భోజనం చేయటం, రాత్రిపూట కంటి నిండా నిద్రించటం మంచిదంటున్నారు. వ్యాయామం, యోగా, ప్రాణాయామం, శ్రావ్యమైన సంగీతాన్ని వినటం వంటి వాటితో మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలని సలహా ఇస్తున్నారు. అలాగే, సంతానం కోసం ప్రయత్నించటానికి ముందే డాక్టర్​ను సంప్రదించడం మంచిదంటున్నారు. థైరాయిడ్, గ్లూకోజ్, హిమోగ్లోబిన్, విటమిన్ మోతాదులతో పాటు నెలసరి తీరు, వీర్యం ఆరోగ్యం వంటి వాటిని పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆటంకం కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆందోళనగా ఉంటే
కంటి నిండా నిద్రపోవటం, హార్మోన్ల సమతుల్యత, అండం విడుదల కావటం, వీర్యం ఉత్పత్తి వంటి శారీరక క్రియలు లయ బద్ధంగా సాగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. శరీరం, మనసు ఎప్పుడూ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా, ఆందోళనతో నిండిపోతే లైంగిక ఆరోగ్యమే దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆందోళనను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
మద్యం
ఈ రోజుల్లో మద్యం తాగటం మాములు విషయంగా మారింది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుందో? లేదో? కానీ సంతానం కోసం ప్రయత్నించే వారికి చేటే చేస్తుందంటున్నారు నిపుణులు. అధికంగా మద్యం సేవించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గవచ్చని అధ్యయనాలు అంటున్నాయి.
అతిగా చేస్తే
ప్రస్తుతం చాలా మంది ఫిట్​నెస్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో క్రాష్ డైట్స్, కొవ్వు కరిగించే, టెస్టోస్టిరాన్​ను పెంచే మందులు, నియంత్రణలో లేని జిమ్ సాధనాలు, సామర్థ్యానికి మించి చేసే వ్యాయామాలు చేస్తున్నారు. ఇవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీర్యం ఉత్పత్తిని అస్తవ్యస్తం చేస్తాయంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -