గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. తరుణ్ రెడ్డి సహ నిర్మాత .
ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు.
అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ,’ఇది చాలా మంచి కథ. మనందరి కథ. మనందరికీ ఎన్నో కథలు, భావోద్వేగాలు ఉంటాయి. అవన్నీ ఈ సినిమా చూసిన తర్వాత మరింతగా అర్థమవుతాయిఅని తెలిపారు. 'ఇలాంటి పాత్రలో నన్ను మీరు ఇప్పటివరకు చూసి ఉండరు అని నటి ఆమని చెప్పారు. నటి ఝాన్సీ మాట్లాడుతూ,’ఏడుగురు మహిళలు ఒక ప్రయాణంలో కలిస్తే ఎంత సరదాగా ఉంటుందో, వారి మధ్య ఏర్పడే బంధం, భావోద్వేగాలు, కన్నీళ్లు ఎంతగా హృదయాన్ని తాకుతాయో ఈ సినిమా చూపిస్తుందిఅని అన్నారు. దర్శకుడు అభిరామ్ నాయుడు మాట్లాడుతూ, 'సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. టీజర్ చూస్తే ఇది అమ్మాయిల కోసం తీసిన సినిమా అనిపించొచ్చు. కానీ నిజానికి ఇది మగాళ్ల కోసంతీసిన సినిమా. మహిళలు బయటకు చెప్పలేని ఎన్నో భావోద్వేగాలను ఇందులో చూపించాం. మీరు కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తే ఒక మంచి అనుభూతి కలుగుతుంది అని తెలిపారు.
‘హ్యాపీ జర్నీ’.. ఇది మనందరి కథ
- Advertisement -
- Advertisement -



