Sunday, June 28, 2026
E-PAPER
Homeసినిమారాజకీయాల్లోకి 'స్టూడెంట్` వస్తే?

రాజకీయాల్లోకి ‘స్టూడెంట్` వస్తే?

- Advertisement -

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘స్టూడెంట్`. విజేత పరీక్ హీరోయిన్. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి కో ప్రొడ్యూసర్స్. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం ఈ సినిమా టీజర్ రిలీజైంది.
సరదాగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ భాను (మేఘాంశ్ శ్రీహరి) ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరుపున పాలిటిక్స్ లోకి రావడం కాలేజ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ‘పక్కనోడు కత్తితో యుద్ధం చేస్తున్నప్పుడు మనం చెయ్యి పెడితే తెగిపోద్ది, మనం పాలిటిక్స్ లో ఉన్నాం, ఇక్కడ ఎథిక్స్ ఉండవు, ఓన్లీ ట్రిక్సే ఉంటాయి’ అంటూ మేఘాంశ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ టీజర్ కు హైలైట్ గా నిలుస్తోంది.

స్టూడెంట్ రాజకీయాల్లోకి వస్తే ఈ పొలిటికల్ ఆటను ఎలా మార్చేయగలడు అనేది ఇంపాక్ట్ ఫుల్ గా చూపించారు. భాను లైఫ్ లో తన్మయితో ఉన్న ప్రేమకథ ఏంటి?, రాజకీయాల్లోకి వచ్చి భాను తను అనుకున్నది సాధించ గలిగాడా లేదా?, భుజంగం, కేతిరెడ్డి మధ్య గొడవలేంటి? అనే అంశాలతో టీజర్ ఆసక్తిని కలిగించింది. లీడర్ లక్షణాలు ఉన్న డేరింగ్ స్టూడెంట్ గా, యంగ్ పొలిటీషియన్ గా మేఘాంశ్ ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ కనబర్చారు అని మేకర్స్ తెలిపారు. మేఘాంశ్ శ్రీహరి, విజేత పరీక్, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య తారాగణం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -