విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జూలై 3 నుంచి ఈటీవీ విన్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో హీరో సత్యదేవ్, దర్శకులు బోయపాటి శ్రీను, కరుణా కరణ్, నిర్మాతలు మైత్రీ రవి, బన్నీవాసు, ఎస్కేఎన్, ధీరజ్, వంశీనందిపాటి అతిథులుగా పాల్గొన్నారు.
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ,’శరత్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఇందులో నా పాత్ర తన గతాన్ని మర్చిపోతుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ తీసుకుని, ఎన్నో భావోద్వేగ క్షణాలను ఎంతో అందంగా కనెక్ట్ చేశారు. ఈ సిరీస్ చేస్తున్నప్పటి నుంచి నాకు కూడా ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నాలాగే మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. శరత్ ఒక మంచి రచయిత కూడా. వినోద్‌కి దర్శకుడిగా చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఆయన ఎక్కడా రాజీ పడకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారుఅని తెలిపారు. 'అల్లు అర్జున్ వద్ద సోషల్ మీడియా హ్యాండిల్ చేశాను. తర్వాత పీఆర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాను. ఇప్పుడు నిర్మాతగా ఈటీవీ విన్‌లో ఒక సిరీస్ చేయడం వరకు వచ్చాను. ఆయన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సిరీస్ అద్భుతంగా వచ్చింది. వెబ్ సిరీస్‌లకు అవార్డులు ఇస్తే, ఈ సిరీస్‌కు తప్పకుండా అవార్డులు వస్తాయి అని నిర్మాత శరత్ చంద్ర నాయుడు చెప్పారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ మాట్లాడుతూ, ‘ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఇంత మంచి సిరీస్ నా తొలి ప్రాజెక్ట్ కావడం మరింత ఆనందంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన భావోద్వేగాలతో కూడిన సిరీస్. ఈ వీకెండ్ మీ కుటుంబంతో కలిసి ఎంతో హాయిగా చూడొచ్చు` అని అన్నారు.
ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా
- Advertisement -
- Advertisement -



