నవతెలంగాణ-రాయికల్ : రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని,అభివృద్ధి మాత్రం నిరంతర ప్రక్రియ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం రాయికల్ పట్టణంలోని మార్కెట్‌వాడలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మాదిగ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కమాన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాయికల్ పట్టణ సమగ్ర అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.రాయికల్ మార్కెట్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని,గతంలో మాదిగ కుంటను కొందరు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని దోమల కుంటగా మార్చారని పేర్కొన్నారు.అంబేద్కర్ సంఘం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పేదల సొంతింటి కల సాకారం అవుతోందని,రాయికల్‌లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పూర్తి కోసం కృషి చేస్తానన్నారు.అమృత్ పథకం కింద 16 లక్షల లీటర్ల సామర్థ్యంతో నీటి ట్యాంకు నిర్మాణం చేపట్టడం ద్వారా పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.రాయికల్‌ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజెంగి నందయ్యను అంబేద్కర్ సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు మచ్చ గంగలక్ష్మి,పల్లికొండ గంగాధర్,మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు,ప్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మాదిగ కుంటను దోమల కుంటగా మార్చారు:ఎమ్మెల్యే సంజయ్ కుమార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



