Monday, June 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సహకార సంఘాల బలోపేతానికి  కృషి

సహకార సంఘాల బలోపేతానికి  కృషి

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
రైతుల ఆర్థిక అభివృద్ధికి, సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, చైర్మన్ మొగలగాని మల్లేశం అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం పిఎసిఎస్ కార్యాలయం వద్ద (పీఏసీఎస్) వారోత్సవాల ప్రారంభ కార్యక్రమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ ని,ఆలేరు పీఏసీఎస్ ఇన్‌చార్జి చైర్మన్ మొగలగాని మల్లేష్, ఇతర కమిటీ సభ్యులతో కలిసి  శాలువాతో ఘనంగా సత్కరించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. సహకార సంఘాల బలోపేతానికి ప్రజాప్రతినిధులు, రైతులు, సభ్యులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. సహకార సంఘాలు రైతుల ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు,  మున్సిపల్ కౌన్సిలర్లు , రైతు సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -