నవతెలంగాణ-హైదరాబాద్: CBSE(The Central Board of Secondary Education) కీలక నిర్ణయం తీసుకుంది. 2020 నూతన విద్యా విధానం(the National Education Policy)లో భాగంగా పాఠశాల స్థాయిలో ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు తప్పనీసరిగా త్రిభాష విధానం ఉండాలని పేర్కొంది. పదో తరగతి విద్యార్థులకు మాత్రం మినహయింపు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులకు మూడు భాషలను అభ్యసించడం తప్పనిసరి అవుతుంది, అందులో కనీసం రెండు భారతీయ భాషలై ఉండాలి. “మూడవ భాష (R3)కు సంబంధించి పాఠశాల స్థాయిలోనే అంతర్గత మూల్యాంకనం జరుగుతుంది. ఈ బ్యాచ్ విద్యార్థులు 10వ తరగతికి చేరుకున్నప్పుడు, ఈ భాషకు సంబంధించి ఎటువంటి CBSE బోర్డు పరీక్షా ఉండదని బోర్డు పేర్కొంది. అలాగే, ప్రస్తుతం 7, 8వ తరగతుల్లో ఉన్న విద్యార్థులు కూడా తమ తదుపరి తరగతులకు వెళ్ళేటప్పుడు మూడు భాషలను అభ్యసించడం కొనసాగిస్తారని CBSE తెలిపింది.



