ఇబ్బందులు పెట్టిన సహించం..

– పచ్చి కార్యకర్తకు గుండెల్లో పెట్టుకుంటా..
– ఇచ్చిన ప్రతి హమీని అమలు చేస్తాం..
– ప్రజా సంక్షేమ పాలన మొదలైంది..
నవతెలంగాణ-డిచ్ పల్లి 
ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హమీని లు చేస్తామని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన దలైందని, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. అదివారం డిచ్ పల్లి మండలం లోని బర్దిపూర్ శివారులోని అమృత గార్డెన్ ఫంక్షన్ హాల్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతూ పథకాన్ని రిబ్బన్ కట్ చేసి బ్రౌచర్లను వైద్యదికారులతో కలిసి లంఛనంగా ప్రారంభించారు.అనంతరం నీయోజకవర్గ కార్యకర్తల విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలు, నిరుపేదలను దృష్టి లో ఉంచుకొని 2 లక్షలతో అరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని,ఇదే కాకుండా 108,104 లను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రవేశ పెట్టి కార్పోరేట్ ఆసుపత్రులకు చికిత్సలు చేయించుకునే విదంగా చుశారని,2014 లో అదికారంలోకి వచ్చిన బిఅర్ఎస్ ప్రభుత్వం అరోగ్య శ్రీ నుండి 5 లక్షల వరకు కార్పోరేట్ ఆసుపత్రులలో వైద్యం చేసుకోవచ్చని తెలిపి, ఆసుపత్రులలో వైద్యం చేసినా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఆసుపత్రుల్లో అరోగ్య శ్రీ పథకాన్ని నిరు గర్తించిందని వివరించారు. అదికారంలోకి వచ్చిన రేండు రోజుల్లోనే రెండు పథకాలు అమలు చేసి గతంలో 300వందల వారకే ఉన్న జబ్బులను 10లక్షలకు పెంచి 1600వందల జబ్బులను కార్పోరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేశించారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు కొలువ దిరిన వేళ సోనియాగాంధీ,రాహుల్ గాంధీ అశీస్సులతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సహకారంతో నిజామాబాదు రూరల్ నియోజక వర్గం అభివృద్ధి కి తాను కృషి చేస్తానన్నారు.  కేసిఅర్ చేస్తున్న అవినీతిని సహించలేక తన మూడు ఏళ్ల ఎమ్మెల్సీ పదవిని త్రునప్రాయంగా ముందుగానే వదిలి వేసి ప్రతి పక్షపాత్ర పోషించానని పేర్కొన్నారు. ప్రజల అశిస్సులతో మీ అందరి సహకారంతో ఎల్ల వేళల అందుబాటులో ఉంటానని తెలిపారు.నియంత పాలనకు స్వస్తి పలికి ప్రజా పాలన ప్రారంభమైందని, తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో తొమ్మిదేండ్లు నియంత పాలన సాగిందని, ఇక నుంచి ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడ్డ  రెండు రోజులలోనే  రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని స్పష్టం చేశారు.ప్రతి కార్యకర్తకు కంటికి రెప్పలా కాపాడు కుంటనని, త్వరలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా నుండి కాంగ్రెస్ ఎంపి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అమలు అయ్యే సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా బిఆర్ఎస్ కార్యకర్తలకే దక్కిందని,కాని కాంగ్రెస్ పార్టీ అలా చేయదన్నారు ఏదైనా సంక్షేమ పథకం అమలు చేస్తే ఆరులైన ప్రతి ఒక్కరికి ప్రజల సొమ్మును పార్టీలకు అతీతంగా కచ్చితంగా అందే విధంగా చూస్తామన్నారు. బావ బామ్మర్దుల గొడవ జరుగుతుందని బావ హరీష్ రావు బిజెపి లో చేరుతారని, కేటీఆర్ అమెరికాకు వెళ్లి పోతారని డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. నియోజకవర్గన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిపే విధంగా ప్రత్యేక కృషి చేస్తానని అందరి సహాయ సహకారాలతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని, పరిశ్రమలు ఇతరత్రా వచ్చే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నియోజకవర్గంలో ప్రజలు చూపిన ఆధారభిమానాలు జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని వారందరినీ గుండెల్లో పెట్టుకుంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని భూపతిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలు గ్రామాలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి పూలమాలలు శలువలతో ఘనంగా సన్మానించారు.ఈశకార్యక్రమంలో సీనియర్ నాయకులు తాహెర్ బిన్ హందన్, నాగేష్ రెడ్డి, ఇమ్మడి గోపి,పోలసాని శ్రీనివాస్,మోత్కురి నవీన్ గౌడ్, అమృత పూర్ గంగాధర్, మునిపల్లి సాయరెడ్డి,ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్,గాడిల రాములు, కంచేట్టి గంగాధర్, డాక్టర్ శాదుల్లా, తరచంద్ నాయక్, శ్యాంసన్, డాక్టర్ శ్రీనివాస్, బైరయ్య, ఎల్ఐసి గంగాధర్, గుట్ట గంగాధర్,సంతోష్ రెడ్డి, సుదకర్, దర్మగౌడ్, బల్ రాం నాయక్, బల్ రాజ్, చెలిమెల నర్సయ్య, దత్తు, డాక్టర్ జాహుర్, తోపాటు మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Spread the love