నవతెలంగాణ – మల్హర్ రావు
గత కొద్ది రోజుల క్రితం మండలంలోని వల్లంకుంట గ్రామనికి చెందిన ఏఎమ్మార్ కంపెనీలో పనిచేసే అడుపా సందీప్ కు చెందిన మొబైల్ ఫోన్ వల్లంకుంట పరిసరాల పోగొట్టుకోవడం జరిగింది. అలాగే ఒడిస్సాకి చెందిన మనోజ్ కొయ్యురు గ్రామానికి వరికోసే మిషన్ పనికి కోసం రాగ కొయ్యురు కాటారం మార్గం మధ్యలొ మొబైల్ పోగొట్టుకోవడం జరిగింది. దానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ని ట్రాక్ చేసి సోమవారం మొబైల్ ని రికవరీ చేసి దానిని పోగొట్టుకున్న బాధితులకు అందించడం జరిగిందని కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలంలో ఎవరైనా తమ మొబైల్ ఫోన్ ని పోగొట్టుకున్న,దొంగిలించబడిన పోలీస్ స్టేషన్ కి సంప్రదించినట్లయితే పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ని ట్రాక్ చేసి వారికి అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు.
పోగొట్టుకున్న సెల్ ఫోన్ల అందజేత
- Advertisement -
- Advertisement -



