- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా సీహెచ్.సింధూశర్మ, ఎస్‌ఐబీ ఎస్పీగా కూడా ఆమెకు అదనపు బాధ్యతలు దక్కాయి. మల్టీజోన్-1 ఐజీగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, యాదాద్రి జోన్ డీఐజీగా జోయల్ డేవిస్, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా, రాజన్న జోన్ డీఐజీగా, వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్.శ్వేత, భద్రాద్రి జోన్ డీఐజీగా, హైదరాబాద్ నార్త్‌రేంజ్ డీఐజీగా ఎస్.ఎం.విజయ్ కుమార్, బాసర జోన్ డీఐజీగా ఆర్.భాస్కరన్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
- Advertisement -



