– ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య
నవతెలంగాణ – రాయపోల్
తహసిల్దార్ కార్యాలయం సొంత భవనం నిర్మాణానికి రూ.2.25 కోట్ల మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తప్పట సుధాకర్ అన్నారు. సోమవారం రాయపోల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సొంత భవనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు కావడం మండల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ప్రభుత్వ సేవలు ఒకేచోట, మెరుగైన వసతులతో ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఈ భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేయలేదని, అభివృద్ధికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రాయపోల్ అభివృద్ధికి అవసరమైన పనులకు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని తెలిపారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి లకు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్లు అశోక్ రెడ్డి, స్వామి, ఊషిగారి స్వామి, నాయకులు కిష్టారెడ్డి, జాల దుర్గాప్రసాద్, మాజీ ఎంపీటీసీ స్వామి, ఏఏంసి డైరెక్టర్లు ఇప్ప మల్లేశం, బాకీ మల్లేశం, ఆదిరెడ్డి, పాల రామగౌడ్, ఉప సర్పంచ్ రాజు,రామకృష్ణ, స్వామి, ఆంజనేయులు, నర్సింలు, జాఫర్, అప్సర్, స్వామి, దుర్గాప్రసాద్, నర్సింగరావు, యూసుఫ్, నాగేశ్వరరావు, స్వామి, అశోక్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



