నవతెలంగాణ – రాయపోల్
మాదిగల్లో అక్షరాస్యత పెంపు, డ్రాప్‌అవుట్‌ల నివారణ లక్ష్యంగా ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో జూలై 5 వరకు 40 రోజులపాటు ‘గో టు విలేజ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్‌పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజు మాదిగ తెలిపారు. సోమవారం రాయపోల్ మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణతో లభించిన 9 శాతం రిజర్వేషన్ అవకాశాలను మాదిగ యువత సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అలాగే జూలై 7న ఎంఆర్‌పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో మాదిగ జాతి పండుగగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యాగల్ల రవి, జర్నలిస్ట్ శ్రీనివాస్,నాయకులు ఇస్తారి, రవి, ప్రశాంత్, స్వామి,తదితరులు పాల్గొన్నారు.
మాదిగల్లో అక్షరాస్యత పెంపునకు ‘గో టు విలేజ్’ కార్యక్రమం
- Advertisement -
- Advertisement -



