Monday, June 29, 2026
E-PAPER
Homeక్రైమ్ఆటో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ఆటో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -

– నిందితుడి అరెస్టు,ఆటో స్వాధీనం
– వివరాలు వెల్లడించిన సీఐ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట పోలీసులు ఆటో చోరీ కేసును వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి, చోరీ కి గురైన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 23, 2026 న శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ ఎదురుగా రోడ్డుపక్కన పార్క్ చేసి ఉంచిన AP 39 VA 1713 నంబరు గల ఆటోను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ ఘటనపై అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం కు చెందిన మహంకాళి వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట ఎస్ హెచ్ ఓ ఎస్‌ఐ టి. యయాతి రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా సత్తుపల్లి మండలానికి చెందిన ఎస్‌కే. రహీమ్ (తండ్రి: జానీ )ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద నుంచి చోరీ కి గురైన ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌ కు తరలించినట్లు అశ్వారావుపేట సీఐ పి. నాగరాజు తెలిపారు. ఈ కేసు ఛేదనలో ఎస్‌ఐ టి. యయాతి రాజు, అదనపు ఎస్‌ఐ జె. దేవ్ సింగ్‌ తో పాటు పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -