Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లేబర్ యాక్టు ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు అందించాలి

లేబర్ యాక్టు ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు అందించాలి

- Advertisement -

ఓసిపిలో విధులు బహిష్కరించిన ఎయిమ్స్ సెక్యురిటీగార్డులు
ప్రశ్నిస్తే కక్ష్య సాధింపు చర్యలు
నవతెలంగాణ – మల్హర్ రావు

రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల నేపథ్యంలో ఎయిమ్స్ యాజమాన్యం రోజుకు రూ.400 చొప్పున ఇస్తున్న వేతనం సరిపోక కుటుంబ పోషణ భారంగా మారిందని,ఇస్తున్న తక్కువ వేతనాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదని,కార్మిక లేబర్ యాక్టు ప్రకారం కనీస వేతనం నెలకు రూ.18 వేలు ఇవ్వాలని గత మూడు రోజులుగా తాడిచెర్ల ఓసిపిలో విధులు నిర్వహిస్తున్న 150 మంది సెక్యూరిటీ గార్డులు విధులు బహిష్కరించి ఓసిపి గేట్ వద్ద మంగళవారం నిరసన,ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడారు తాము ఏడు సంవత్సరాలుగా ఎయిమ్స్ యాజమాన్యానికి వెట్టి చాకిరి చేస్తున్నా తమను ఎయిమ్స్ అధికారులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీస వేతనాలు అమలు చేయాలని ప్రశ్నించిన పదిమంది గార్డులపై కక్ష్య సాధింపు చర్యలతోపాటు విధుల నుంచి తొలగించారని వాపోయారు.ఏడేళ్లలో ఇప్పటికి 20 మంది గార్డులను తోలగించి, రూ.30 నుంచి రూ.40 వేల వరకు లంచాలు తీసుకొని కొత్తవారిని పెట్టుకోవడం జరిగిందని ఆరోపించారు.తొలగించిన ఎనిమిదిమంది గార్డులను విధుల్లోకి తీసుకొని,కనీస వేతనాలు అమలు చేసేంత వరకు తమ పోరాటం అగదన్నారు.కంపెనీగార్డులకు ఏడాదికి ఒక డ్రెస్,షూ ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదని ఒకవేళ ఇస్తే వేతనం నుంచి రూ.2వేలు కట్ చేసుకోవడం జరుగుతుందన్నారు.

వేతనాల్లో పిఏప్,ఈఎస్ఐ అమలు చేయాలని కోరితే యాజమాన్యం బెదిరింపులకు గురిచేస్తోందన్నారు.చాలీచాలని వేతనాలతో బానిసలుగా వెట్టిచాకిరి చేస్తున్న ఉద్యోగ బద్రత లేదన్నారు.ఇటీవల వచ్చిన గాలివాన బీభత్సవానికి సెక్యూరిటీ డబ్బా కొట్టుకపోయి ఇద్దరు గార్డులకు గాయలైయ్యాయన్నారు.తమ హక్కులసై ప్రశ్నిస్తే ఎం చేస్తారో చేసుకొండని ఎయిమ్స్ కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు దుర్బలాడినట్లుగా గార్డులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో 150 మంది గార్డులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -