నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ముకుంద్ రెడ్డిని జిల్లా జై గౌడ్ ఉద్యమం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జై గౌడ్ ఉద్యమం అధ్యక్షుడు రంగోల మురళీధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు కర్రోల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో జై గౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక, సేవా కార్యక్రమాలను నూతన సూపరిండెంట్‌కు వివరించారు.
అనంతరం ఎక్సైజ్ సూపరిండెంట్ ముకుంద్ రెడ్డి మాట్లాడుతూ.. గౌడ సామాజిక వర్గం సంప్రదాయ వృత్తితో పాటు సమాజాభివృద్ధిలోనూ విశేష పాత్ర పోషిస్తోందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. గౌడ సంఘాల ప్రతినిధులు చేసే నిర్మాణాత్మక సూచనలను సానుకూలంగా పరిశీలిస్తూ, పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సుందర్ సింగ్, జిల్లా జై గౌడ్ ఉద్యమం బాధ్యులు నర్స గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.



