Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జులై 1న ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

జులై 1న ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

- Advertisement -

–  నునావత్ గణేష్ నాయక్
నవతెలంగాణ – కామారెడ్డి

జులై 1న లంబాడా హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి తండాలో ఘనంగా నిర్వహించి, ఎల్‌హెచ్‌పీఎస్ జెండాను ఆవిష్కరించాలని లంబడా హక్కుల పోరాట  సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ నాయక్ మాట్లాడుతూ, లంబాడా హక్కుల పరిరక్షణ కోసం సమితి అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు.

లంబాడా సంస్కృతి, సంప్రదాయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలకు అతీతంగా లంబాడా సమాజం ఐక్యంగా నిలిచి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గిరిజన జనాభాలో లంబాడాలు మూడో స్థానంలో ఉన్నప్పటికీ, రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం లేదని పేర్కొన్నారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధించే దిశగా లంబాడా యువత, ప్రజలు ముందుకు రావాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్, గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవీందర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు దేవి సింగ్ నాయక్, టౌన్ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -