నవతెలంగాణ – దర్పల్లి
మండలాభివృద్థికి కార్యకర్తలందరూ నాయకులతో పాటు సమన్వయంతో పనిచేయాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి అన్నారు. ఇటీవల కాంగ్రేస్ పార్టీ నూతన మండల అధ్యక్షుగా నియమించిన గాదె నేరేష్ మంగళవారం మండల పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షుడు గాదె నరేష్ కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ ఆదేశాలను గౌరవిస్తూ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. పంతాలకు పోకుండా అందరు చిన్న పెద్ద అనే తరతమ్యం లేకుండా కలిసి కట్టుగా పార్టీ కొరకు పనిచేసి మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి పర్చుకోవాలని అన్నారు. కార్యక్రమములో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సొసైటీ చేర్మెన్ చెలిమేల మల్లికార్జున్, దర్పల్లి సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, జిల్లా నాయకులు సురేందర్ నాయక్, మనోహర్ రెడ్డి, పుప్పాల సుభాష్, కాలూర్ రాజు, మురళి, ప్రతాప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



