నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో సుదీర్ఘకాలం పాటు విధులను నిబద్ధతతో నిర్వహించి పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఉషయ్యను మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మంగళవారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ ఉషయ్య మున్సిపల్ శాఖ అభివృద్ధికి అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో ఆయన చూపిన క్రమశిక్షణ, నిజాయితీ, సేవా తత్పరత ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆయన ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డి ఇ హన్మంతా రావు, ఏ ఇ వేణు ప్రసాద్, ఆర్ ఓ గోపాల్ రెడ్డి, అకౌంటెంట్ రాములు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని ఉషయ్యను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా వీడ్కోలు పలికారు.



