– కార్యకర్తలు ప్రలోభాలకు లొంగకుండా ఉండాలి
– మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు
నవతెలంగాణ – ఊరుకొండ
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువజన విభాగం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిలబడాలని మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు పిలుపు నిచ్చారు. మంగళవారం ఊరుకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జడ్చర్లలో నిర్వహించిన ఎస్ ఐ ఆర్ మరియు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై అవగాహన చేయడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హరీష్ రావును మార్గమధ్యంలో ఊరుకొండ స్టేజి దగ్గర కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి ఊరుకొండ సర్పంచ్ మేకల మంజుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, మండల సర్పంచులు, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



