ఆపిల్ కంపెనీ ఆందోళన
చెన్నయ్ : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్‌కు భారత్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్‌లో జరిగిన భారీ డేటా లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సంస్థపై దాడి చేసిన వరల్డ్ లీక్స్ అనే రాన్సమ్‌వేర్ ముఠా తాజాగా డార్క్ వెబ్‌లో ఆపిల్ రాబోయే ఫోన్ ఐఫోన్ 18 ప్రోకి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని బయటపెట్టింది. లీకైన పత్రాల్లో ఐఫోన్ 18 ప్రో మోడళ్లకు సంబంధించిన పరికరాలు, వాటిని సరఫరా చేసే కంపెనీల జాబితా, బ్యాటరీ, కెమెరా, మెయిన్ సర్క్యూట్ బోర్డ్ భాగాల వివరాలతో పాటు టాటా ప్లాంట్‌లో నిర్వహించిన డ్రాప్ టెస్ట్ కు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఆపిల్ తన సరఫరాదారుల వివరాలను ఎక్కడా బయటపెట్టదు. కానీ ఈ లీక్ ద్వారా ఆ వివరాలన్నీ వెల్లడి కావడంతో ఆపిల్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ పరిణామం ఆపిల్, టాటా భాగస్వామ్య విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఆపిల్ అంతర్గత విచారణ జరుపుతోంది. మరోవైపు టాటా ఎలక్ట్రానిక్స్ తన సిస్టమ్స్‌లో యాక్సెస్‌ను నియంత్రించడంతో పాటు ఫోరెన్సిక్ ఆడిట్ కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్‌ను నియమించింది.
ఐఫోన్ 18 ప్రో కీలక సమాచారం లీకు
- Advertisement -
- Advertisement -



